కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ


మణిపాల్ హాస్పిటల్స్‌లోని కార్డియోవాస్కులర్ మరియు థొరాసిక్ సర్జన్లు గుండె, ఛాతీ మరియు ఊపిరితిత్తుల పరిస్థితులను పరీక్షించి శస్త్రచికిత్స చేస్తారు. ఎమర్జెన్సీ మరియు ముందస్తుగా ఎంచుకున్న కేసులు రెండింటిలోనూ దాదాపు అన్ని కార్డియాక్ మరియు థొరాసిక్ పరిస్థితులకు ఈ విభాగం సరికొత్త మరియు అత్యంత వినూత్నమైన శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా చికిత్సను అందిస్తుంది.

OUR STORY

Know About Us

Why Manipal?

మణిపాల్ హాస్పిటల్స్ అనేది దేశంలోనే చాలా అనుభవం కలిగి మరియు సమగ్ర చికిత్స అందించే  కార్డియోవాస్కులర్ మరియు థొరాసిక్ సర్జరీ విభాగాలలో ఒకటి, ఇది దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే రోగులకు సంరక్షణ అందిస్తోంది. మణిపాల్ హాస్పిటల్స్ లోని కార్డియాలజిస్టులు హృదయ సంబంధిత  శస్త్రచికిత్సలలో ప్రపంచం లోనే అగ్రగామిగా  ఉన్నారు, ఇందులో ఓపెన్-హార్ట్ సర్జరీలు మరియు ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేస్తుంటారు. గుండె సమస్యలను ఖచ్చితమైన నిర్ధారణ చేయడం కోసం సరికొత్త అత్యాధునిక సాంకేతికత మరియు మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ వంటి అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులను ఉపయోగిస్తూ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ విభాగం దాని ఆధునికతకు ప్రసిద్ధి చెందింది.

Treatment & Procedures

హార్ట్ వాల్వ్ రిపేర్ & రీప్లేస్‌మెంట్

మానవ గుండెలో 4 కవాటాలు ఉంటాయి, ఇవి గుండె నుంచి రక్త ప్రసరణ చేయడానికి బాధ్యత వహిస్తాయి. కవాటాలు దెబ్బతినవచ్చు లేదా వాటికి వ్యాధి కలగవచ్చు, ఈ సందర్భంలో వాటిని చికిత్స చేయడం లేదా మార్చడం అవసరం అవుతుంది. దెబ్బతిన్న కవాటాలలో ప్రత్యేకమైన రింగ్ పెట్టడం ద్వారా రిపేర్ చేయవచ్చు, అయితే రిపేర్ చేయడం కంటే కృత్రిమ కవాటాలు పెట్టడం ద్వారా దెబ్బతిన్న కవాటాలను మారుస్తారు.…

Read More

మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్…

శరీరంపై చాలా తక్కువగా కోయడం ద్వారా చేసే, రోగికి కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తూ మరియు కోలుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తూ చేసే శస్త్రచికిత్సా ప్రక్రియను ఎంఐసిఎస్ అంటారు, దీనిని కీహోల్ సర్జరీ అని కూడా పిలుస్తారు. అధునాతన శస్త్రచికిత్సా పరికరాలను ఉపయోగించి, ఒక సర్జన్ చాలా ఖచ్చితత్వంతో రాజీ పడకుండా మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (ఎంవిఆర్) వంటి సంక్లిష్టమైన…

Read More

మణిపాల్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత చెందిన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం అప్పుడే పుట్టిన శిశువులు, నెలల శిశువులు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారికి అనేక గుండె సమస్యలకు చికిత్స చేస్తున్నారు.

పీడియాట్రిక్ రోగులకు  పీడియాట్రిక్ హార్ట్ సర్జన్‌ లు గుండె ట్రాన్స్ప్లాంట్ నుండి ఇంప్లాంటేషన్ల వరకు అన్నింటిలో మల్టీడిసిప్లినరీ విధానం, శ్రద్ధ మరియు అంకితభావంతో కూడిన ఉత్తమ చికిత్సా విధానం వలన  మణిపాల్ హాస్పిటల్స్ లోని ఈ విభాగం ఎన్నో విజయాలు సాధించింది. దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి మణిపాల్ హాస్పిటల్స్‌కి ఎక్కువ కేసులు రిఫర్ చేయడమే ఈ ప్రయత్నానికి నిదర్శనం.

మణిపాల్ హాస్పిటల్స్ లోని కార్డియోవాస్కులర్ మరియు కార్డియోథొరాసిక్ సర్జన్లు పెద్దలు మరియు పిల్లల కార్డియోథొరాసిక్ మరియు వాస్కులర్ సర్జికల్ విధానాలు రెండింటిలో నిపుణులుగా ఉన్నారు.
కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ విభాగం క్రింది వాటి చికిత్సలో ప్రత్యేకత కలిగి ఉంది, అవి హార్ట్ సిఎబిజి, ఎల్ వి అనూరిజం రిపేర్, టోటల్ ఆర్టేరియల్ రివాస్కులరైజేషన్, వెంట్రిక్యులర్ సెప్టల్ రప్చర్ యొక్క రిపేర్, ఆరోటిక్ అనూరిజం శస్త్రచికిత్సలు, గుండె కవాట రిపేర్ మరియు మార్పిడి, రెడో గుండె శస్త్రచికిత్స, మాసివ్ హెమోప్టిసిస్ కోసం ఎమర్జెన్సి లంగ్ రెసెక్షన్, శ్వాసనాళ పునర్నిర్మాణం, మరియు అక్యుట్ లింబ్ ఇస్కీమియా కోసం రివాస్కులరైజేషన్.

Facilities & Services

మణిపాల్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక ఇమేజింగ్ సౌకర్యాలతో, నిరంతర శస్త్రచికిత్స అనంతర సంరక్షణ అనేది చికిత్స చేయబడిన ప్రతి వ్యాధికి మూలం లాంటిది, వాటిలో కొన్ని, పెద్దలకు సాధారణ కార్డియాక్ సర్జరీలు అయిన కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (సిఎబిజి), వాల్వ్ రిపేర్ మరియు రీప్లేస్‌మెంట్, ఇస్కీమిక్ మిట్రల్ వాల్వ్ కోసం సర్జరీ, రెగ్యురిటేషన్ మరియు పోస్ట్ ఇన్ఫార్క్ట్ వెంట్రిక్యులర్ సెప్టల్ లోపాలు, లెఫ్ట్, వెంట్రిక్యులర్ అనూరిజమ్స్ కోసం డిఓఆర్ ఆపరేషన్, రీడో సర్జరీ ఫర్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ మరియు సిఎబిజి, గ్రోన్-అప్ కంజెనిటల్ హార్ట్ (జియుసిహెచ్) ఆపరేషన్స్ కామన్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలు అయిన  వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ మరియు ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ వంటి పుట్టుకతో వచ్చే గుండె లోపాల కోసం ఓపెన్ హార్ట్ సర్జరీ, టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్‌తో కలిపి సంక్లిష్ట లోపాలు, సింగిల్ వెంట్రికల్, గ్రేట్ ఆర్టరీస్ మార్పిడి (టిజిఎ), వెంట్రిక్యులర్ సెప్టల్ లోపాలు, క్యాత్ బేస్డ్ ఇంటర్వెన్షన్, మరియు ఆర్టరీయల్ సెప్టల్ లోపాల విశ్లేషణ, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ మరియు డివైస్ క్లోజర్,  నవజాత శిశువులకు గుండె శస్త్రచికిత్సలు అయిన రక్త ప్రసరణలో అడ్డంకులు (పల్మోనరీ స్టెనోసిస్, బృహద్ధమని సంబంధ స్టెనోసిస్, బృహద్ధమనిలో గడ్డకట్టడం), పుట్టుకతో వచ్చే హార్ట్ సర్జరీ వాస్కులర్ సర్జరీల కోసం కాస్మెటిక్ విధానాలు కార్డియాక్ మైక్సోమాస్ యొక్క విచ్ఛేదనం, ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ, సిఎబిజి తో పాటు కరోటిడ్ ఎండార్టెరెక్టమీ, ఇస్కీమిక్ అవయవాలకు పెరిఫెరల్ వాస్కులర్ సర్జరీలు, మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులకు డయాలసిస్ కనిష్టంగా ఇన్వాసివ్ సర్జరీలు అయిన  ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్ మరియు రిప్లేస్మెంట్, ఆర్టరీ సెప్టల్ లోపం మరియు పేటెంట్ ఫోరమెన్ ఓవల్ క్లోజర్, ఆర్టరీయల్ ఫిబ్రిల్లెషన్ కోసం మేజ్ ప్రక్రియ, కొరోనరీ ఆర్టరీ బైపాస్ కోసం సఫేనస్ వెన్ హార్వెస్ట్, మిట్రల్ వాల్వ్ రిపేర్ మరియు రిప్లేస్మెంట్, ఆరోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, అట్రియోవెంట్రిక్యులర్ సెప్టల్ లోపం శస్త్రచికిత్స మరియు కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ 

FAQ's

A cardiothoracic surgeon is a medical doctor who specializes in surgical procedures of the heart, lungs, esophagus, and other organs in the chest. This includes surgeons at the best cardiothoracic surgery hospital in Vijayawada who can be called cardiac surgeons, cardiovascular surgeons, general thoracic surgeons, and congenital heart surgeons.

కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ సరళమైనది మరియు సంక్లిష్టమైనది కావచ్చు, ప్రక్రియ ఏమైనప్పటికీ, మణిపాల్ హాస్పిటల్స్ మీకు అడుగడుగునా సహకరిస్తుంది, ప్రణాళిక ప్రకారం సరైన చికిత్స అందించడానికి తోడ్పడుతుంది, సరైన శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మరియు కోలుకోవడానికి సహాయం అందిస్తుంది. వివిధ రకాల కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ గురించి మరియు చికిత్స కోసం మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మరియు ఈరోజే మా సర్జన్‌లలో ఒకరితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

Call Us