అనస్థీషియాలజీ


మణిపాల్ హాస్పిటల్స్‌లోని అనస్థీషియాలజీ విభాగం, శస్త్రచికిత్సల సమయంలో నొప్పిని తగ్గించడానికి, చిన్నచిన్న ఇన్వాసివ్ మరియు సంక్లిష్టమైన ఓపెన్ సర్జరీల కోసం శస్త్రచికిత్సకు ముందస్తు సంరక్షణతో రోగులకు సహాయం చేస్తుంది. ఇది ఇతర విభాగాలతో కలిసి పని చేస్తుంది మరియు సాధారణ అనస్థీషియా, లోకల్ అనస్థీషియా, పెయిన్ మెడిసిన్, ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ మరియు క్రిటికల్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లను అందిస్తుంది.

OUR STORY

Know About Us

Why Manipal?

మణిపాల్ హాస్పిటల్స్ లోని అనస్థీషియాలజిస్టులు ఆసుపత్రిలో చాలా గౌరవనీయులైన అనుభవం కలిగినవారిలో ఒకరు. శస్త్రచికిత్సల సమయంలో శ్వాస మరియు ఎయిర్వే, డ్రగ్ మరియు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మరియు వంటి వైటల్స్ చూసుకుంటారు మరియు ఆపరేషన్ సమయంలో రోగి జీవితానికి వారు బాధ్యత వహిస్తారు. సర్జికల్ టేబుల్‌పై వారి అపారమైన నైపుణ్యం అనేది ప్రక్రియను సులభం చేసి మరియు రోగికి సర్జన్ల అవసరం రోగికి తగ్గేలా చేస్తుంది.

Treatment & Procedures

లోకల్ అనస్థీషియా

ఈ రకమైన అనస్థీషియా స్ప్రే, ఇంజెక్షన్ లేదా ఆయింట్మెంట్ రుపంల్ ఇవ్వబడుతుంది. శస్త్ర చికిత్స చేసే ప్రాంతం మాత్రమే మొద్దుబారిపోతుంది. ఇది ప్రధానంగా చెయ్యి లేదా పాదాల శస్త్రచికిత్స వంటి ఔట్ పేషెంట్ విధానాలకు ఉపయోగించబడుతుంది

Read More

రీజనల్ అనస్థీషియా

ఇది శరీరంలోని ఒక ప్రత్యేక భాగాన్ని మోద్దుబారేలా చేయడానికి ఉపయోగించే అనస్థీషియా యొక్క ఒక రూపం, ఉదాహరణకు, ఎపిడ్యూరల్ లేదా స్పైనల్ అనస్థీషియా లేదా నర్వ్ బ్లాక్ అనస్థీషియా

Read More

జనరల్ అనస్థీషియా

ఈ రకమైన అనస్థీషియా రోగి స్పృహలో లేనప్పుడు ఒక నిర్దిష్ట ప్రక్రియ లేదా శస్త్రచికిత్స చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ సమయంలో వైటల్ సూచనలు మరియు అవయవ విధులు నిశితంగా పరిశీలించబడతాయి. శస్త్రచికిత్సకు ప్రతిస్పందనగా శరీరంలో కలిగిన ఒత్తిడి తగ్గించడానికి నొప్పి మందులు ఇవ్వబడతాయి. ఇది శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత…

Read More

వివిధ రకాల అనస్థీషియా క్రింద ఇవ్వబడినవి:

జనరల్  అనస్థీషియా:

  • అనస్థీషియా యొక్క నిరంతరంగా అలాగే ఇస్థూ ప్రక్రియ అంతటా రోగి నిద్రలో ఉండేటట్టుగా మరియు నొప్పి లేకుండా ఉంచబడుతారు. శస్త్రచికిత్స ముగింపులో, అనస్థీషియా ప్రభావం మారుతుంది మరియు అతను/ఆమె మేల్కొంటాడు.

  • రీజనల్ అనస్థీషియా: లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్‌ ఉపయోగించడం వలన రోగి మెలకువగా ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయాల్సిన భాగం మాత్రం తాత్కాలికంగా మొద్దుబారుతుంది. వెన్నుపాము చుట్టూ ఉన్న ద్రవంలోకి ఇంజెక్షన్ చేస్తే, దానిని స్పైనల్ అనస్థీషియా అంటారు. వెన్నుపామును కప్పి ఉంచే కోశం చుట్టూ లోకల్ అనస్థీషియా ఇంజెక్ట్ చేయబడితే, దానిని ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటారు.  కొన్ని ప్రత్యేక నరాల గ్రూప్ చుట్టూ ఇంజెక్షన్ చేస్తే, దానిని ప్లెక్సస్ బ్లాక్ అంటారు.

  • పర్యవేక్షణతో కూడిన అనస్థీషియా సంరక్షణ: కొన్ని శస్త్రచికిత్సలు లోకల్ అనస్థీషియాను ఉపయోగించి చేయవచ్చు, ఈ ప్రక్రియలో ఇంజెక్షన్ ఆపరేషన్ చేయవలసిన భాగం చుట్టూ చేయబడుతుంది. చాలావరకు ఇది చిన్న చిన్న శస్త్రచికిత్సలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, రోగి భయపడుతుంటే లేదా శస్త్రచికిత్స ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం పడుతుందని అనుమానం ఉంటే, మత్తు, నొప్పి ఉపశమనం కోసం అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనస్థీషియా నిపుణులు 'స్టాండ్-బై'గా ఉండాల్సిన అవసరం ఉంది

అనస్థీషియాలజీ విభాగం రోజుకు 25కి పైగా విభిన్న ప్రత్యేక విభాగాలకు సేవ అందిస్తూ బిజీగా ఉండే విభాగం. ఒక అనస్థీషియాలజిస్ట్ మిమ్మల్ని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా శస్త్రచికిత్స చేయించుకోవడానికి సహాయపడుతారు, వారు నొప్పి తగ్గించడంలో సహాయపడతారు మరియు నొప్పి నుంచి ఉపశమనం అనేది  మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలను ఇస్తుంది మరియు శస్త్రచికిత్స అనంతర సమస్యలను తగ్గిస్తూ కోలుకోవడంలో సహాయపడుతుంది.

Facilities & Services

అనస్థీషియాలజీ విభాగం కింది వాటికి సంరక్షణ మరియు నైపుణ్యాన్ని అందిస్తుంది:

1. నొప్పి ఉపశమనం  2. కార్డియాక్ అనస్థీషియా 3. పీడియాట్రిక్ అనస్థీషియా 4. న్యూరో అనస్థీషియా 5. ప్రసూతి అనస్థీషియా 6. క్రిటికల్ కేర్ మెడిసిన్ 7. హోస్పైస్ మరియు ఉపశమన మందు

FAQ's

There are three types of anesthesia; local, regional, and general. Local anesthesia is specific; a small area of the body is numbed while one is conscious or awake. Regional anesthesia is administered to numb a specific region of nerves on the body. The patient may be awake/ conscious or receive a sedative for a light sleep during the operation. The patient may remember parts of the procedure but should be free of pain. General anesthesia is a state of regulated unconsciousness that results in a loss of body sensation through anesthetic drugs, such as gases or vapors inhaled through a mask or breathing tube or drugs given through an IV. It is rare for patients to have any memory during general anesthesia.

మీరు సమస్యల గురించి ఏదైనా శస్త్రచికిత్స చేసుకోవాలని ఆలోచిస్తుంటే, మెరుగైన శస్త్రచికిత్స కోసం మరియు చికిత్స కోసం ఈరోజే మమ్మల్ని సంప్రదించండి. మేము దేశంలోనే ఎటువంటి హాని లేకుండా మరియు అత్యంత సరసమైన చికిత్సలను అందిస్తున్నాము. ఈరోజే మా నిపుణులలో ఒకరితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి మరియు నొప్పి లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.

Explore Stories

Appointment
Health Check
Homecare icon Home Care
Contact Us
Write to COO
Review Us
Call Us